
సాగర్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ
నాగార్జునసాగర్: హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన పలువురు సుందరీమణులు బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని ఈ నెల 12న నాగార్జునసాగర్‌కు రానున్నారు. సాగర్‌లోని బుద్ధవనం, విజయ విహార్ అతిథిగృహం ప్రాంతాల్లో వారు పర్యటించనున్న నేపథ్యంలో ఆ ప్రదేశాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక సోమవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, పోలీస్ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై బుద్ధవనంలోని మహాస్థూపం అంతర్భాగంలో గల సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ.. భద్రతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశఽంలో నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్, హాలియా సీఐ జనార్దన్‌గౌడ్, హాలియా, సాగర్ సర్కిళ్ల పరిధిలోని ఎస్‌ఐలు సంపత్‌గౌడ్, వీరశేఖర్, వీరబాబు, సతీష్‌రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.