
పెరిగిన వినియోగం.. అందని గృహజ్యోతి
పొదుపు అత్యంత కీలకం..
విద్యుత్ వాడకం విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వృథాను అరికట్టాలి. పొదుపు అత్యంత కీలకం. ఇంటిలో మనుషులు ఏ గదిలో అవసరం ఉంటే ఆ గదిలోనే లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు వినియోగించాలి. గృహజ్యోతి లబ్ధిదారులు మరింత పొదుపు పాటించాలి. వీరు 200 యూనిట్లకు మించి విద్యుత్‌ను వాడితే బిల్లు భారం భరించాల్సిందే. –శ్రీనివాస్,
విద్యుత్‌శాఖ డీఈఈ, సూర్యాపేట.
నాగారం : భానుడి ప్రతాపంతో ప్రజలతోపాటు పశుపక్ష్యాదులు విలవిలలాడుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులు ఉంటేనే ఇళ్లను వదిలి బయటకు వస్తున్నారు. ఉపశమనం కోసం పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా పెరిగిపోయింది. ఫలితంగా గృహజ్యోతికి పలువురు దూరమయ్యారు.
అమాంతం పెరిగిన వినియోగం
జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు వచ్చే సరికి గృహజ్యోతి లబ్ధిదారులు 1,78,950 మంది ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు చేసుకుని సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల నుంచి ఆమోదం పొంది మార్చిలో 168 మంది, ఏప్రిల్‌లో 113 మంది అర్హులుగా ఎంపికయ్యారు. 200 యూనిట్లలోపు వినియోగించే వారికి మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. 200 యూనిట్లకు మించి ఒక్క యూనిట్ వినియోగించినా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే.
పరిమితికి మించి వాడకంతో..
ఎండల తీవ్రత అధికంకావడంతో ఇళ్లలో ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. కొందరు ఏసీలు కూడా వాడుతున్నారు. పరిమితికి మించి వాడకంతో మార్చిలో 2,138 మంది, ఏప్రిల్‌లో 6,228 మంది గృహజ్యోతి పథకానికి అర్హత కోల్పోయారు. అలాగే మే నెలలో మాత్రం ఈ సంఖ్య భారీగా పెరగడంతో 10,225 మంది అనర్హులయ్యారు. మూడు నెలల్లో మొత్తం 18,591 మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తించలేదు.
ఫ వేసవిలో పెరిగిన ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలవాడకం
ఫ 200యూనిట్లు దాటిన మీటర్ రీడింగ్
ఫ పథకానికి మూడునెలల్లో 18,591మంది దూరం
ఫ విద్యుత్ పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులు
జిల్లాలో గృహజ్యోతి పథకం వివరాలు
నెల మొత్తం అర్హులు పథకానికి
దూరమైనవారు
మార్చి 1,78,950 1,76,812 2138
ఏప్రిల్ 1,79,118 1,72,890 6228
మే 1,79,231 1,69,006 10,225

పెరిగిన వినియోగం.. అందని గృహజ్యోతి