దేశంలో టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్‌గాంధీ
హుజూర్‌నగర్ : దేశంలో టెక్నాలజీకి ఆద్యుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువ లేనివని అన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న, నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, ఈడ్పుగంటి సుబ్బారావు, అరుణ్ కుమార్ దేశ్‌ముఖ్, దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్ రెడ్డి, జక్కుల మల్లయ్య, అజీజ్‌పాషా, జేఎస్, అమర్‌నాధ్ రెడ్డి, మజీద్, మన్సూర్‌అలీ, మహేష్, యోహాన్, ఐల వెంకన్న పాల్గొన్నారు.


