సృజనాత్మకతకు వేళాయే..
నేటి నుంచి జిల్లా స్థాయి
సైన్స్ ఫెయిర్
● హుజూర్‌నగర్‌లోని విజయ
విద్యామందిర్‌లో ఏర్పాట్లు
● రెండు రోజుల పాటు సైన్స్
ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్న విద్యార్థులు
● కార్యక్రమాన్ని ప్రారంభించనున్న
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు సృజనాత్మకతకు పదును పెట్టే సమయం ఆసన్నమైంది. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచే వైజ్ఞానిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. 2025–26 విద్యా సంవత్సరం జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌ను మంగళ, బుధవారాల్లో హుజుర్‌నగర్‌లోని విజయ విద్యా మందిర్ పాఠశాలలో నిర్వహించేందుకు విద్యాశాఖ అధి కారులు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈసైన్స్ ఫెయిర్‌ను ఉదయం 10గంటలకు నీటిపారుదల పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో ఏడు జూనియర్, ఏడు సీనియర్ ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు.
ఎగ్జిబిట్ల అంశాలు
1. సుస్థిర వ్యవసాయం
2. వ్యర్థ పదార్థాల నిర్వహణ
3. ప్రత్యామ్నాయ మొక్కలు
4. హరితశక్తి(పునరుత్పాదక శక్తి)
5. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత,
వినోదభరిత గణిత నమూనాలు
6. ఆరోగ్యం, పరిశుభ్రత
7. నీటి సంరక్షణ – నిర్వహణ
300 సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన..
జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 180, ప్రైవేట్ పాఠశాలలు 250, ప్రాథమికోన్నత 70, కేజీబీవీలు 18, మోడల్ స్కూల్స్ తొమ్మిది, అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ 12 ఉన్నాయి. వీటిలో ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు ప్రాజెక్టులు తీసుకురానున్నారు. అయితే జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో ఇన్‌స్పైర్ మనక్ పోటీల్లో ఎంపికై న 64 ప్రాజెక్టులు, ఉపాధ్యాయుల ప్రాజెక్టులు 10తో పాటు మొత్తం 300 సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈఓ అశోక్ కోరారు. వీవీఎం స్కూల్‌లో సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించే ఎగ్జిబిట్లను తిలకించటానికి జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ఎగ్జిబిట్లను తిలకించడం వల్ల విద్యార్థుల్లో జిజ్ఞాస, శాస్త్రవిజ్ఞానం పెంపొందుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, ఎంఈఓలు సైదా నాయక్, సలీం షరీఫ్, వివిధ మండలాల కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, గెజిటెడ్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.
23 పర్యవేక్షణ కమిటీల ఎంపిక
సైన్స్‌ఫెయిర్ నిర్వహణకు ఉపాధ్యాయులతో 23 కమిటీలను నియమించి బాధ్యతలు అప్పగించారు. వీరు ఎప్పటికప్పుడు సైన్స్ ఫెయిర్ నిర్వహణ చూసుకుంటారు. సైన్స్‌ఫెయిర్‌లో ఏర్పాట్లు, విద్యార్థులకు వసతి, భోజన, మంచినీరు, ఇతర సౌకర్యాలు ఈ కమిటీల సభ్యులకు అప్పగించారు. కమిటీలో మొత్తం 200 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
సృజనాత్మకతకు వేళాయే..


