సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జననేత్రి
మునగాల: నూతనంగా ఎన్నికై న మునగాల సర్పంచ్ నల్లపాటి ప్రమీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జననేత్రి కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 1,2,3,12,14 వార్డులలో ఆమె పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుక్కలు, కోతుల బెడదను నివారించాలని పలువురు .. సర్పంచ్ దృష్టికి తీసువచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కారస్ల వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వార్డు సభ్యులు, గ్రామపెద్దలు కొప్పుల జైపాల్‌రెడ్డి, నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల జానకిరెడ్డి, కాసర్ల కోటేశ్వరరావు, ఉప్పుల యుగంధర్‌రెడ్డి, ఎండి.రషీద్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం రాత్రి మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల కసరత్తు వేగవంతం కానుంది. వార్డుల వారీగా తుది ఓటరు జాబితాలతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా ఖరారు చేసి జనవరి 10న ప్రకటించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నెల 30న మున్సిపాలిటీల వారీగా వివరాలు సరిచూసుకోవాలని, 31వ తేదీన వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. జనవరి 1న పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాల ముసాయిదా ప్రకటించాలని స్పష్టం చేసింది. 5వ తేదీన మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో, 6వ తేదీన జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని వివరించింది. 10వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా ఫైనల్ ఓటర్ల జాబితాలు ప్రకటించాలని వెల్లడించింది. అలాగే మున్సిపాలిటీల వారీగా 2011 ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలను కూడా జారీచేసింది.
డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జ్‌గా
బాధ్యతల స్వీకరణ
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. బ్యాంకు అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఉద్యోగులను కోరారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ శంకర్‌రావు, అధికారులు నర్మద, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్, మైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి
సూర్యాపేటటౌన్ : ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట రమణారెడ్డి సూచించారు. సోమవారం సూర్యాపేట లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేశులతో కలిసి ఈకార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ భవాని, కాకతీయ యూనివర్సిటీ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ ఎ. మధు, పీపీటీసీటీ డివిజన్ కౌన్సిలర్ ఎన్.లక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ శాస్త్రి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు సింగ్ మధు, సృజన పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జననేత్రి
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జననేత్రి


