
కుమారి సేవలు మరువలేనివి
మునగాల: మునగాల మండలం కొక్కిరేణికి చెందిన ములకలపల్లి కుమారి చేసిన సేవలు మరువలేనివని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. కొక్కిరేణికి చెందిన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు సతీమణి కుమారి(48) అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందారు. బుధవారం ఆమె స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో వారు పాల్గొని మాట్లాడారు. తొలుత కుమారి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని మాట్లాడారు. రాములు పార్టీ నాయకుడిగా ఎదగడంలో కుమారి పాత్ర మరువలేనిదని కొనియాడారు. రాములు పార్టీ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో ఎంతో ఓర్పుతో ఉంటూ అన్ని విధాల సహాయసహాకారాలు అందజేశారన్నారు. కార్యక్రమంలో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం సీనియర్ నాయకులు చెరుపల్లి సీతరాములు,ి జి.నరసింహారావు, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్, ఎండి. జహంగీర్, వ్యవసాయ కార్మికసంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, తప్పెట స్కైలాబ్‌బాబు, అర్.వెంకటరాములు ప్రసాద్, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, డబ్బికారు మల్లేష్, తుమ్మల వీరారెడ్డి, కోట రమేష్, పాలడుగు ప్రభావతి, పాలడుగు నాగార్జున, చినపాక లక్ష్మీనారాయణ, నాగారపు పాండు, కోట గోపి, మట్టిపెల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, బొప్పన పద్మ, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, వట్టెపు సైదులు, మిట్టగణుపులు ముత్యాలు, షేక్ సైదా, దేవరం వెంకటరెడ్డి, బుర్రి శ్రీరాములు, నందిగామ సైదులు, రావులపెంట వెంకన్న, శంభయ్య పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ