
డెంగీతో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : డెంగీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్బంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ఎప్పటికప్పుడు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. దోమలు ఇళ్ల పరిసరాల్లో ఉన్న గాబులు, తొట్లు, డ్రమ్ములు, ట్యాంకుల్లో ఉన్న నీటి నిల్వల్లో, పాత టైర్లు, ఎయిర్ కూలర్లు,, పూల కుండీల్లో ఉన్న నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జయమనోహరి, అశ్రిత, మోతీలాల్, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు, సూపర్‌వైజర్ వెంకన్న, మనోజ్‌రెడ్డి, కడారి రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.