
‘గోపా’ బలోపేతానికి కృషిచేయాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) బలోపేతానికి కృషిచేయాలని ఆ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీకూరు సత్యం గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సాయి గౌతమి జూనియర్ కళాశాలలో గోపా జిల్లా అధ్యక్షుడు బూర రాములు గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశాని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విస్తృత స్థాయిలో గోప సభ్యత్వాలు చేయించాలని, భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురికి సభ్యత్వాలు అందజేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాతి సవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరగాని లక్ష్మయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు నామాల గురుమూర్తి గౌడ్, కోశాధికారి అయితబోయిన రాంబాబు గౌడ్, జాయింట్ సెక్రటరీలు రాపర్తి మహేష్ గౌడ్, భూపతి నారాయణ గౌడ్, అంతటి వెంకన్న గౌడ్, దొరేపల్లి రమేష్ గౌడ్ ఈసీ సభ్యులు కొత్త పుల్లయ్య గౌడ్, బూర సుధాకర్ గౌడ్, భూపతి వెంకటయ్య గౌడ్, ఉయ్యాల సోమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.