
పిల్లలమర్రి శివాలయంలో జిల్లా ప్రధాన జడ్జి పూజలు
తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో గల చారిత్రాత్మక శివాలయాన్ని ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్జి ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను దేవాలయ ప్రధాన అర్చకుడు మునగలేటి సంతోష్‌శర్మ శాలువా కప్పి సత్కరించి, మెమొంటో అందజేశారు.
ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్లు ఇవ్వొద్దు
సూర్యాపేట : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వొద్దని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, న్యాయవాది తల్లమల్ల హస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎస్పీ వర్గీకరణ తీర్పు, గైడ్‌లైన్స్‌ను సరిగ్గా పరిశీలించకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం తగదని పేర్కొన్నారు. ఈ విషయంపై మాల మహానాడు, షెడ్యూల్డ్ కులాల హక్కుల ఫోరం తరఫ/న హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. రెండు వాయిదాల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వొద్దని పేర్కొన్నారు.
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు కొనసాగాయి. దీంట్లో భాగంగా సుప్రభాత సేవ, నిత్యాగ్నిహోత్రి, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన, అమ్మవార్లకు సహస్ర కుంమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం, శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం జరిపారు. ఆ తర్వాత మహావేధనతో భక్తులను తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్, అర్చకులు తుమాటి లక్ష్మాణాచార్యులు, నర్సింహమూర్తి, ఆంజనేయచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
‘మీసేవ’ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా శ్రీకాంత్
సూర్యాపేట అర్బన్ : తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా సూర్యాపేట పట్టణానికి చెందిన గొట్టిపర్తి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని బృందావన్ ఇన్‌లో అన్ని జిల్లాల అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికై న శ్రీకాంత్‌తో ప్రమాణస్వీకారం చేయించి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు అధ్యక్ష, కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
యాదగిరి క్షేత్రంలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట: ఓ వైపు నిత్య పూజా కార్యక్రమాలు, మరోవైపు భారీగా తరలివచ్చిన భక్తుజనులతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామును ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలో అలంకారమూర్తుల కు నిజాభిషేకం, తులసీదళ అర్చనచేశారు. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన హో మం, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, ముఖమండపంలో అష్టోత్తర పూజ లు నిర్వహించారు. రాత్రికి శ్రీస్వామి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.

పిల్లలమర్రి శివాలయంలో జిల్లా ప్రధాన జడ్జి పూజలు

పిల్లలమర్రి శివాలయంలో జిల్లా ప్రధాన జడ్జి పూజలు