
లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలి
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈనెల 10నుంచి 15వరకు జరిగే తిరుకల్యాణోత్సవాలకు ఎలాంటిలోటుపాట్లు లే కుండా ఏర్పాట్లు చేయాలని హుజూర్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు ఆదేశించారు. మట్టపల్లి ఆలయంలో తిరుకల్యాణోత్సవ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. వాహనాల పార్కింగ్, తలంబ్రాల మండపం, వివిధ కులవృత్తుల అన్నదాన సత్రాలు, స్నానఘాట్‌లను పరిశీలించారు. అనంతరం పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు జయప్రదమయ్యేలా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈకార్యక్రమలో హుజూర్‌నగర్ సీఐ గజ్జె చరమందరాజు, మఠంపల్లి ఎస్‌ఐ పి.బాబు, ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ సిరికొండ నవీన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెడ్డి అన్నదాన సత్రంలో 10వేల మందికి భోజన ఏర్పాట్లు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలోని రెడ్డి నిత్యఅన్నదాన సత్రంలో ఈనెల 10నుంచి 15 వరకు జరిగే శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలకు తరలివచ్చే సుమారు 10వేల మంది భక్తులకు సరిపడా అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సత్రం కమిటీ అధ్యక్షుడు సాముల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక సత్రంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో మాట్లాడారు. సత్రంలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఈనెల 10న రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సత్రం కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకా చౌదరిరెడ్డి, జనరల్ సెక్రటరీ చిట్టెంరెడ్డి నాగిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు వి.శంభిరెడ్డి, ఎస్. క్రిష్ణారెడ్డి, చిన్నపురెడ్డి, జి.క్రిష్ణారెడ్డి, ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.
శివుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు విశేషంగా చేపట్టారు. సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖమండపంలోని స్పటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాత సేవ,గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు సహస్రనామార్చనతో కొలిచారు. ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణంముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు పూజలు గావించారు.

లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలి