
కొత్త రేషన్‌కార్డులు1,238 మంజూరు
చిలుకూరు: రేషన్ దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం కలుగుతోంది. ఈ నెలలో జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డులు 1,238 మంజూరయ్యాయి. నూతనంగా 11,752 మంది కుటుంబ సభ్యుల పేర్లను పాత కార్డుల్లో చేర్చారు. కొత్త కార్డుదారులు వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
రేషన్‌కార్డుల జారీ సరళతరం
రేషన్‌కార్డుల జారీని ప్రభుత్వం సరళతరం చేసింది. దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల వ్యవధిలో కార్డు మంజూరు చేస్తోంది. కుటుంబ సభ్యుల పేర్లు కూడా చక చకా చేర్చుతున్నారు. కార్డు రాలేదని, కుటుంబసభ్యుల పేర్లు చేర్చడం లేదని కార్యాలయాల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, పాత కార్డుల్లో పేరు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆ పేరు తొలగించుకోవాలి. నిబంధన ప్రకారం అర్హత కలిగిన కుటుంబాలకు కార్డులు జారీ అవుతున్నాయి. కొత్త రేషన్‌కార్డులు, కుటుంభ సభ్యుల పేర్లను చేర్పించే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేసి వారు అర్హులో కాదో నిర్ణయిస్తారు.
రేషన్ దరఖాస్తులకు మోక్షం
కొత్తగా చేర్చిన యూనిట్లు 11,752
వచ్చేనెల 1నుంచి కొత్త లబ్ధిదారులకు బియ్యం పంపిణీ
కొత్తగా మంజూరైన కార్డులు
1238
రేషన్‌షాపులు
610
కొత్తగా చేర్చిన యూనిట్ల సంఖ్య 11,752
జిల్లాలో ఉన్న మొత్తంకార్డులు 3,26,057
మొత్తం యూనిట్లు 9,85,061