మోసాలకు పాల్పడుతున్న యువతి అరెస్టు! | Fake Female Police Officer Arrested | Sakshi
Sakshi News home page

మోసాలకు పాల్పడుతున్న యువతి అరెస్టు!

May 27 2025 11:30 AM | Updated on May 27 2025 11:30 AM

Fake Female Police Officer Arrested

ఐఏఎస్‌ అంటూ డబ్బున్న  యువకులకు వలపు వల 

బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.లక్షల్లో వసూలు 

మిర్యాలగూడ అర్బన్‌: తాను డాక్టర్, ఐఏఎస్‌ అధికారిని అంటూ డబ్బున్న యువకులను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న యువతిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన ఓ యువతి కొంత కాలంగా డబ్బున్న యువకులను బ్లాక్‌మెయిల్‌ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఆమెపై మలక్‌పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ వన్‌టౌన్, నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. 

గత మూడు రోజుల క్రితం యువతి మర్డర్‌ అంటూ హైదరాబాద్‌లోని ఓ డీఎస్పీకి, మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ పరిధిలో ఓ సీఐకి ఫోన్‌చేసి స్వీచ్‌ ఆఫ్‌ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం ఓ వైద్యుడిని బెదిరించి అతడి నుంచి రూ.5లక్షలు వసూలు చేసి ఉడాయించినట్లు సమాచారం. 

ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్‌ చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించడంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువతి బాగోతం వెలుగుచూడటంతో నివ్వెరపోయారు. యువతిని అరెస్టు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌ చేసినట్లు తెలిసింది.   

Advertisement
 
Advertisement
Advertisement