రైతన్న సాగుబాట | - | Sakshi
Sakshi News home page

రైతన్న సాగుబాట

May 27 2025 1:51 AM | Updated on May 27 2025 1:51 AM

రైతన్

రైతన్న సాగుబాట

రోహిణి కార్తె రాకతో వ్యవసాయ పనులు ప్రారంభం

మంగళవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2025

అణగారిన వర్గాలకు

చదువును దూరం చేసే కుట్ర

సూర్యాపేట : అణగారిన వర్గాలకు చదువును దూరం చేసే కుట్రలో భాగమే గురుకులాలను రద్దు చేయడం అని పీడీఎస్‌ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్‌ కుమార్‌ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 ఇంటర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల మూసివేతను విరమించుకోవాలని కోరుతూ సోమవారం పీడీఎస్‌యూ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1985 నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో దళిత విద్యార్థులకు విద్యను అందిస్తూ ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న ఈ గురుకుల కళాశాలలను మూసివేడం దారుణమన్నారు. కార్యక్రమంలో సూరం విజయ్‌, వినయ్‌, వివేక్‌, సన్నీ, సాయి, మాతంగి విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

నాలుగో తరగతి

ఉద్యోగులుగా గుర్తించాలి

హుజూర్‌నగర్‌ : సివిల్‌ సప్లయ్‌ హమాలీ కార్మికులను ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్‌ కోరారు. సోమవారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని మార్కెట్‌లో నిర్వహించిన సివిల్‌ సప్లయ్‌ హమాలీ కార్మికుల (ఏఐటీయూసీ) యూనియన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. హమాలీకార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు చేసి, ప్రమాద బీమా నష్టపరిహారం రూ.10 లక్షలు ఇవ్వాలని, 60 ఏళ్లు దాటిన ప్రతి కార్మికుడికి రూ. 5 వేల పింఛన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో జి .మల్లయ్య, బి. రామ్మూర్తి, బి .సైదులు, పి. వెంకన్న, జె. మల్లయ్య, పి .గోపి, బాలాజీ, భిక్షం, వెంకన్న, కృష్ణ, వీరేశం శివ పాల్గొన్నారు.

బాలకార్మిక వ్యవస్థ

నిర్మూలనకు పోరాడాలి

నూతనకల్‌: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ అలుపెరగని పోరాటం చేయాలని రాష్ట్ర విద్యా కమిషన్‌ సభ్యుడు, ఎంవీ ఫౌండేషన్‌ జాతీయ కో ఆర్డినేటర్‌ ఆర్‌. వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నూతనకల్‌ మండల కేంద్రంలో నిర్వహించిన ఎంవీ ఫౌండేషన్‌ సామాజిక కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్‌ మండల మాజీ కో ఆర్డినేటర్‌ రామచంద్రయ్య, చిప్పలపెల్లి రవి, విజయ్‌కుమార్‌, దండా సురేందర్‌రెడ్డి, సూరారపు వెంకన్న, దామోదర్‌నాయక్‌, అంజయ్య, చైతన్య, భారతమ్మ, రుజీనా పాల్గొన్నారు.

భానుపురి (సూర్యాపేట): వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రోహిణి కార్తె ఆదివారం ప్రారంభం కావడంతో దుక్కులు దున్నడం, విత్తనాల కొనుగోలు పనుల్లో బిజీ బిజీగా మారారు. నైరుతి రుతు పవనాలు రెండు, మూడు రోజుల్లో రానుండడంతో ఈలోగా పత్తి పంట సాగుకు భూములను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ సంవత్సరం 6.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది.

రోహిణి కార్తె ప్రారంభం..

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వరి సాగు అధికంగా ఉంటుంది. ఆ తర్వాత పత్తిని రైతులు సాగు చేస్తుంటారు. మెట్ట పంటల సాగు కోసం ఈ రోహిణి కార్తెనుంచి పనులను మొదలు పెడుతుంటారు. ఆదివారం రోహిణికార్తె ప్రారంభం కావడంతో ఒకటి రెండు రోజులుగా రైతులు వ్యవసాయ పనులను మొదలుపెట్టారు. పత్తి కట్టెను ఏరడం, తగులబెట్టడం, చెత్తాచెదారం తొలగించే పనులను ముమ్మరం చేశారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రానుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మరో వర్షం పడితే పత్తి విత్తనాలు విత్తుకునేందుకు వీలుగా తమ భూములను సిద్ధం చేస్తున్నారు. ఇక వరి సాగు చేసే రైతులు సైతం నార్లు పోసుకునేందుకుగాను ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరి పొలాల్లో ఎలుగడ్డ దున్నుకొని జీలుగ విత్తనాల సాగుకు సిద్ధమవుతున్నారు.

ఓవైపు కొనుగోళ్లు.. మరోవైపు తనిఖీలు..

పది రోజుల్లో పత్తి విత్తనాలను విత్తుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలను కొనుగోలు చేసేందుకు దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. స్థానికంగా కొనుగోలు చేయడంతో పాటు ఏపీలోని నందిగామ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు ముమ్మరం చేసింది. విత్తనాల కొరత లేకుండా చూడడం తోపాటు వ్యవసాయ, పోలీస్‌, రెవెన్యూ శాఖల సమన్వయంతో విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు వరి సాగు అయ్యేవరకు ఇలాగే కొనసాగాలని రైతులు కోరుతున్నారు.

వానాకాలం సాగు అంచనా..

సూర్యాపేట పట్టణంలోని లోతట్టు

ప్రాంతాల్లో డ్రెయినేజీల్లో పూడికతీత

రానున్న వర్షాకాలంలో వరద బారిన పడకుండా ప్రత్యేక ప్రణాళిక

ఇటీవలే పనులు ప్రారంభించిన మున్సిపల్‌ యంత్రాంగం

కార్డు మంజూరు నిరంతర ప్రక్రియ

కొత్త రేషన్‌కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ. పాత రేషన్‌కార్డులో పేర్లు లేకుంటే దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి వెంటనే కొత్త కార్డు మంజూరు చేస్తున్నాం. ఈ నెలలో నూతనంగా 1,238 రేషన్‌కార్డులు మంజురు చేశాము.

– మోదుగు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా

ఇన్‌చార్జి పౌరసరఫరాల అధికారి, సూర్యాపేట జిల్లా

న్యూస్‌రీల్‌

ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు

జిల్లాలో ఈ వానకాలం సీజన్‌లో 6.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుతాయని అంచనా వేస్తున్నాం. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగువుతుంది. ఎన్ని విత్తనాలు అవసరమో ఇప్పటికే అంచనా వేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందిస్తాం. నకిలీ విత్తనాలను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నాం. రైతులు మంచి వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలను విత్తుకోవాలి.

–శ్రీధర్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

దుక్కులు దున్నకం, విత్తనాల

కొనుగోలులో బిజీ బిజీ

ఈసారి ముందే పలకరించనున్న

నైరుతితో కర్షకుల్లో హర్షం

ఈసారి సాగు అంచనా

6.17 లక్షల ఎకరాలు

వేరుశనగ 400

చెరుకు 60

మిర్చి 15,150

ఆయిల్‌పాం 4,000

ఇతర పంటలు 150

పండ్లు, కూరగాయలు 16,200

మొత్తం 6,17,480

ఎరువుల అంచనా (మెట్రిక్‌ టన్నుల్లో)

అవసరం నిల్వ

యూరియా 60,731 15,680

డీఏపీ 14,580 855

ఎంఓపీ 9560484

కాంప్లెక్స్‌ 45,247 8,377

ఎస్‌ఎస్‌పీ 5,275 532

పంట ఎకరాలలో

వరి 4,85,125

పత్తి 91,000

మొక్కజొన్న 45

కంది 2650

పెసర 2700

రైతన్న సాగుబాట1
1/4

రైతన్న సాగుబాట

రైతన్న సాగుబాట2
2/4

రైతన్న సాగుబాట

రైతన్న సాగుబాట3
3/4

రైతన్న సాగుబాట

రైతన్న సాగుబాట4
4/4

రైతన్న సాగుబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement