
కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గం
చివ్వెంల(సూర్యాపేట) : కక్షిదారులకు రాజీ మార్గమే రాజమార్గం అని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. జూన్ 14న లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసుల పరిష్కారంలో పోలీసులు, జ్యుడీషియల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని, సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉంచాలన్నారు. ఇప్పటికే జిల్లాకు కేసుల పరిష్కారంలో మంచి పేరు ఉందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణలకే కోర్టుల మెట్లు ఎక్కుతున్నారని, దీనివల్ల కాలం, ధనం, వృథా అవుతుందన్నారు. లోక్‌అదాలత్‌లో సివిల్, క్రిమినల్, బ్యాంకు, మోటర్ వెహికిల్, విద్యుత్, ఎకై ్సజ్ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, ఏఎస్‌పీలు నాగేశ్వర్‌రావు, అప్పారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డీఎస్‌పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద