
డీఎంహెచ్‌ఓను సస్పెండ్ చేయాలి
భానుపురి (సూర్యాపేట) : అర్హతలు, ధృవపత్రాలు లేకున్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోకున్నా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లకు అనుమతులిచ్చిన డీఎంహెచ్‌ఓను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, మాస్‌లైన్ (ప్రజాపంథా) పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని మహర్షి డిగ్రీ కళాశాలలో తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో పేదల ఆరోగ్యం–నకిలీ డాక్టర్స్ ప్రభుత్వ వైఖరి అంశంపై నిర్వహించిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో మెడికల్ మాఫీయాపై రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కోకన్వీనర్ లింగయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాంబాబు, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు పోలెబోయిన కిరణ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నరేష్, రాష్ట్ర నాయకులు బాషిపంగు సునీల్, పోరెళ్ల విప్లవ్‌కుమార్, అశోక్, కరీం, గడ్ల రమాశంకర్, బంటు సందీప్, ధరావత్ వెంకటేష్, సంతోష్‌రెడ్డి, నాగేశ్వర్‌నాయక్, చామకూర మహేందర్, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.