
నేడు ఉత్తమ్ పర్యటన
హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బుధవారం హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో బయలు దేరి 10 గంటలకు మేళ్లచెరువులోని ఓ సిమెంట్ పరిశ్రమలోని హెలిపాడ్‌లో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 10.30 నుంచి 1 గంట వరకు చింతలపాలెం మండలంలోని ఎంబీసీ, నక్కగూడెం, బుగ్గమాదారం లిఫ్టు పనులు పరిశీలించి వాటి పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 3 గంటలవరకు హుజూర్‌నగర్‌లో ఆర్‌అండ్‌బీ, జూనియర్, డిగ్రీ కళాశాలల నూతన భవనాలను పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3. 30 వరకు హౌసింగ్ కాలనీ, ఐటీఐ, ఏటీఐ భవనాలను పరిశీలిస్తారు. 3.30 నుంచి 4.30 వరకు మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్‌ను పారంభిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అనంతగిరి మండలం శాంతినగర్‌లో నూతనంగా మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై అధికారులతో చర్చిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కోదాడ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళతారు.
సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తాం
అర్వపల్లి: సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్‌రెడ్డి, మార్కెటింగ్ డీపీఎం ఆంజనేయులు స్పష్టం చేశారు. జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ సెర్ప్ 1వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీలించారు. ఇక్కడి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను తొలగించడంతో మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్దార్ చిప్పలపల్లి యాదగరి , ఏపీఎం నగేష్, గిర్దావర్ వెంకట్‌రెడ్డి, ఏఈఓ ఎన్. సత్యం, రైతులు శంకర్, శ్రీరాములు, భిక్షం, మల్లయ్య, నరేందర్, నాగయ్య, లింగయ్య, సైదులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నడిగూడెం: సూర్యాపేట జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు, బాలికల పాఠశాలలు, కళాశాలల్లో 2025–26వ విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ అధికారిణి సీహెచ్.పద్మ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగి ఉండి అనుభవజ్ఞులైన, ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తులను సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. బాలికల పాఠశాలల్లో బోధించడానికి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 97045 50271, 80089 95137 నంబర్లలలో సంప్రదించవచ్చని సూచించారు.
మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని, దీనిపై ఆశాకార్యకర్తలు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ కోరారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ అర్బన్ పీహెచ్‌సీలో ఆశార్కర్లకు నిర్వహించిన లీగల్ లీటరసీ క్యాంపులో ఆమె మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు వసంత సత్యనారయణ పిళ్లే యాదవ్, ఏడిండ్ల అశోక్, దావుల వీర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నేడు ఉత్తమ్ పర్యటన