నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లపై అవసరమైతే పీడీయాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. నకిలీ విత్తన అమ్మకాలు, నివారణ చర్యలపై మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు, విత్తన డీలర్లతో జిల్లా సీడ్ టాస్క్‌ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2025 –26 వానాకాలం సీజన్‌కు గానూ వ్యవసాయ శాఖ తరఫున ముందస్తు ప్లానింగ్‌లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని విత్తన డీలర్లకు విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రామాల్లో నకిలీ విత్తనాలు తీసుకొస్తే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్ 6281492368 కు సమాచారం అందించాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ పథకాలపై మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి నాగయ్య, కోదాడ డీఎస్పీ పి.శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు, సూర్యాపేట జిల్లా విత్తన డీలర్లు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కల్తీ విత్తనాలు తీసుకొస్తే కంట్రోల్ రూం నంబర్ 6281492368కు సమాచారం ఇవ్వాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


