
కష్టజీవుల రాజ్యం వస్తేనే సుందరయ్యకు నివాళి
నేరేడుచర్ల: కష్టజీవుల రాజ్యం వస్తేనే కమ్యూనిస్టు ఉద్యమనేత, బడుగుల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్యకు నిజమైన నివాళి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో సిరికొండ శ్రీను అధ్యక్షతన నిర్వహించిన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామంలో కోలాట దళంతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు అనంత ప్రకాశ్, నీలా రాంమ్మూర్తి, మర్రి నాగేశ్వర్‌రావు, శ్రీధర్, నాగ సైదులు, ధనుంజయ, సత్యం, మట్టయ్య, శ్రీను, హుస్సెన్, కోటయ్య, మట్టేష్, శ్రీను తదితరులున్నారు.