మొండికేస్తున్న మిల్లర్లు | - | Sakshi
Sakshi News home page

మొండికేస్తున్న మిల్లర్లు

May 21 2025 1:43 AM | Updated on May 21 2025 1:43 AM

మొండికేస్తున్న మిల్లర్లు

మొండికేస్తున్న మిల్లర్లు

జాజిరెడ్డిగూడెం మండలంలోని ఐకేపీ సెంటర్‌కు చెందిన ధాన్యం 20 రోజుల క్రితం కోదాడలోని ధనలక్ష్మి రైస్‌ మిల్లుకు వచ్చింది. మూడు రోజులు ధాన్యం దిగుమతి చేసుకోలేదు. అనంతరం ధాన్యం నాణ్యత లేదని తాము దిగుమతి చేసుకోబోమని చెప్పడంతో ఆ లారీని అక్కడి నుంచి చిలుకూరు మండలం బేతవోలుకు పంపారు. అక్కడ కూడా ధాన్యం దిగుమతి చేసుకోలేదు. దీంతో ఐకేపీ సెంటర్‌ నిర్వాహకులు రైతులను వెళ్లి మాట్లాడుకోవాలని చెప్పారు. అక్కడి నుంచి రైతులు వచ్చి మిల్లర్‌తో మాట్లాడారు. క్వింటాకు 4 కేజీలు తరుగు తీస్తామని దానికి ఒప్పుకుంటేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లర్‌ చెప్పడంతో రైతులు అంగీకరించారు. అప్పుడు ధాన్యం దిగుమతి చేసుకున్నారు.

ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లపైనే

అదనపు భారం

కోదాడ డివిజన్‌లో ఉన్న 10 మిల్లులు అధికారులు చెప్పిన టార్గెట్‌ మేరకు ధాన్యం దిగుమతి చేసుకున్నారు. మిగిలిన 12 మిల్లులు ఇచ్చిన టార్గెట్‌లో 50 శాతం ధాన్యం కూడా దిగుమతి చేసుకోకపోవడంతో టార్గెట్‌ పూర్తి చేసిన తమనే అదనంగా ధాన్యం తీసుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వారు అంటున్నారు. హుజూర్‌నగర్‌ డివిజన్‌లో 18 మిల్లులు ఉండగా ఐదు మిల్లులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన అధికారులు మిగిలిన 13 మిల్లుల్లో 7 మిల్లులు టార్గెట్‌ పూర్తి చేశాయి. తమ మిల్లుల వద్ద ధాన్యం నిలువ చేసుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందని చెప్పినా అధికారులు వినకుండా తమకే అధికంగా ధాన్యం కేటాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మిగిలిన 6 మిల్లులు 50శాతం మాత్రమే టార్గెట్‌ పూర్తి చేశాయని వాటికి ధాన్యం కేటాయించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని టార్గెట్‌ పూర్తి చేసిన మిల్లర్లు అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు పూర్తి అయిన ధాన్యం నిలువ ఉంటే ఉన్నతాధికారులు ఊరుకోవడం లేదని దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అదనంగా ధాన్యం కేటాయించక తప్పడం లేదని అధికారులు అంటున్నారు. దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్న మిల్లులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, అదితమ చేతిలో పని కాదని కిందిస్థాయి అధికారులు అంటున్నారు.

సీఎంఆర్‌ ధాన్యం తీసుకోవడానికి కొర్రీలు

సన్నరకాల నుంచి నూక ఎక్కువగా వస్తుందని నిరాకరణ

టార్గెట్‌ పూర్తిచేసిన మిల్లర్లకే అదనంగా ధాన్యం కేటాయిస్తున్న అధికారులు

ఐకేపీ, పీఏసీఎస్‌ లోడ్‌ అంటేనే హడలిపోతున్న లారీ డ్రైవర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement