
లారీల కొరతలేకుండా చేస్తాం
అర్వపల్లి: ధాన్యం తరలింపునకు రెండు రోజుల్లో లారీల కొరత లేకుండా చేస్తామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, తిమ్మాపురం, అడివెంల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు.రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి శుభ్రం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆపరేటర్లు రైతుల వివరాలను వెంటనే ట్యాబ్‌లలో నమోదుచేసి, సకాలంలో బిల్లులు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్దార్ చిప్పలపల్లి యాదగిరి, గిర్దావర్ పాటి వెంకట్‌రెడ్డి, కేంద్రాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.