
బోరు బావుల్లో సమృద్ధిగా నీరు
మూసీ నదిపై చెక్ డ్యామ్‌లు నిర్మించడం వల్ల గ్రామంలో బోర్లు, బావులు ఎండిపోలేదు. సమృద్ధిగా నీరు రావడంతో నీటి కొరత తలెత్తలేదు. గతంలో వేసవి వచ్చిందంటే బోర్లు, బావుల్లో నీరు తగ్గిపోయి ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. చెక్ డ్యామ్‌లు నిర్మించాక నీటి సమస్యకు పరిష్కారం లభించింది. – వెంకట్‌రెడ్డి, దోసపహాడ్, పెన్‌పహడ్
రైతులను ప్రోత్సహించాలి
వాటర్‌షెడ్ పథకంలో భాగంగా అన్ని వాగుల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు, ఊట కుంటలు నిర్మించాలి. వృథాను అరికట్టేలా రైతులకు మెళకువలు నేర్పించాలి.
– కొండూరి స్వామి, రైతు, జనగాం, నారాయణపూర్

బోరు బావుల్లో సమృద్ధిగా నీరు

బోరు బావుల్లో సమృద్ధిగా నీరు