
నృసింహుడిని దర్శించుకున్న సమాచార కమిషనర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులను దర్శించుకుని, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు అతిథి గృహం వద్ద కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి వారికి స్వాగతం పలికారు.