సాగర్‌కు సుందరీమణులు
నేడు బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్‌వరల్డ్ పోటీదారుల బృందం
టూర్ షెడ్యూల్ ఇలా..
● మధ్యాహ్నం 1.00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరుతారు.
● 3 గంటలకు చింతపల్లి సమీపంలోని వెల్లంకి గెస్ట్ హౌజ్‌కు చేరుకుని 3.30 గంటల వరకు అక్కడ సేదదీరుతారు.
● 4.30కు నాగార్జునసాగర్ విజయ విహార్‌కు చేరుకుంటారు.
● సాయంత్రం 5 గంటల వరకు విజయవిహార్‌లో ఫ్రెష్ అప్ అవుతారు.
● 5.30 వరకు టీ, ప్రధాన ద్వారం వద్ద ఫొటో షూట్‌లో పాల్గొంటారు.
● 5.45 వరకు విజయ విహార్ నుంచి బుద్ధవనం చేరుకుంటారు.
● 6 గంటల వరకు అక్కడ ఫొటో సెషన్ ఉంటుంది.
● 6.10కి స్వాగత నృత్యం నడుమ మహాస్థూపం వద్దకు చేరుకుంటారు.
● 6.20 వరకు మహాస్థూపం విషేశాలను గైడెడ్ టూర్ శివనాగిరెడ్డి వారికి వివరిస్తారు.
● 6.30 వరకు బుద్ధశాసన వద్ద ప్రపంచ సుందరీమణుల ధ్యానం చేస్తారు.
● 6.40 నుంచి 6.50 వరకు బుద్ధవనంపై సంక్షిప్త ఉపన్యాసం ఉంటుంది.
● 6.50 నుంచి 7 గంటల వరకు జాతకవనంలో గడుపుతారు.
● రాత్రి 7 నుంచి 7.45 వరకు జాతకవనం వద్ద డిన్నర్ చేస్తారు.
● 7.45 నుంచి 8.45 వరకు వెల్లంకి గెస్ట్‌కు చేరుకుంటారు.
● 9 గంటల వరకు అక్కడ సేదతీరుతారు.
● 11 గంటలకు హైదరాబాద్
చేరుకుంటారు.
నాగార్జునసాగర్ : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారుల బృందం సోమవారం నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించనుంది. వారి రాక సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన సుందరీమణులు నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ముందుగా వీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి చింతపల్లి సమీపంలో ఉన్న వెల్లంకి అతిథి గృహం వద్ద కాసేపు ఆగుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయవిహార్ చేరుకుంటారు. అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనం చేరుకుంటారు. ఈ సందర్భంగా సుమారు 24 మంది లంబాడా కళాకారులు వారికి లంబాడా నృత్యంతో స్వాగతం పలకనున్నారు. మహా స్థూపం వద్ద స్వాగతం అనంతరం స్థూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేశారు.
మహాస్థూపంలో సుందరీమణుల ధాన్యం
సుందరీమణులు మహాస్థూపంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి విశేషాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వారికి వివరిస్తారు. అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం, తర్వాత ఇక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహా బోధి పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతకవనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం ప్రాముఖ్యతను పురావస్తు, టూరిజమ్ ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతక వనం సందర్శన అనంతరం బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు
ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో తెలంగాణ పర్యాటక అంతా నాగార్జునసాగర్‌లో ఆయా ప్రాంతాలను సిద్ధం చేసింది. బౌద్ధ పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం చారిత్రక ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజేసేలా ఏర్పాట్లు చేసింది. పపంచ సుందరీమణులు సేదదీరేందుకు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహాన్ని తీర్చిదిద్దింది. టైల్స్, బెడ్లు, కర్టెన్స్, కుర్చీలు, టేబుల్స్ అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసింది. బుద్ధవనం, విజయ విహార్ అతిథి గృహాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సిద్ధం చేశారు. సుందరీమణులు ఇక్కడే డిన్నర్ చేయనున్నందున వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే వారికి భోజనాలు తీసుకురానున్నారు.
ఫ పర్యటనకు అంతా సిద్ధం చేసిన పర్యాటక శాఖ
ఫ లంబాడా నృత్యంతో వారికి స్వాగతం
ఫ విజయవిహార్‌లో విడిది.. బుద్ధవనంలో ధ్యానం చేసేలా ఏర్పాట్లు


