ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకుందాం
కోదాడరూరల్ : ఫొటో, వీడియోగ్రాఫర్లు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకుందామని రాష్ట్ర ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు షేక్.హుస్సేన్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవన్‌లో ది కోదాడ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడారు. కుటుంబ భరోసా పథకాన్ని ఏర్పాటు చేసుకొని ఆపదలో ఉన్న ఫొటో, వీడియో గ్రాఫర్ల కుటుంబాలకు రూ.3.50 కోట్ల మేర ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, టీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ.. కోదాడలో ఫొటోగ్రాఫర్ల భవన నిర్మాణ సమస్యను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షుడు వనపర్తి వర్మ, ప్రధాన కార్యదర్శి కరిశ స్వామి, కోశాధికారిగా నక్క సురేష్‌బాబు ప్రమాణాస్వీకారం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కూకుట్ల లాలు, గౌరవ అధ్యక్షులు బొమ్మల వెంకన్న , జూలురు బసవయ్య, జెమిని నరేష్ పాల్గొన్నారు.


