పేద ప్రజల పక్షాన నిలిచిన ఎర్రజెండా
సూర్యాపేట అర్బన్ : స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి కార్మిక హక్కుల పోరాటం వరకు ఎర్రజెండా ఎప్పుడూ పీడిత ప్రజల పక్షాన నిలిచిందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్‌కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వందేళ్లుగా శ్రామిక వర్గం వైపు నిలబడి పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీకి జేజేలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నాగయ్య, లక్ష్మయ్య, శంకర్, సైదులు, సంధ్య, కిరణ్, నరసింహారావు, నాగమల్లు, బొల్లె వెంకన్న, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ అఖిల భారత రైతు కూలీ సంఘం
రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు


