లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు | - | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

May 11 2025 12:22 PM | Updated on May 11 2025 12:22 PM

లైసెన

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు రాబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న వారిలో అర్హత కలిగిన ప్రైవేట్‌ సర్వేయర్లతోపాటు కొత్త వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారికి లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి అమలులో వారి సేవలను వినియోగించుకుని భూ సమస్యలు పరిష్కరించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 500 మందికి సర్వేయర్లుగా త్వరలోనే ప్రత్యేక శిక్షణ ప్రారంభించబోతోంది.

26 నుంచి శిక్షణ

భూభారతి అమలులో భాగంగా రాష్ట్రంలో ఐదు వేల మందికి సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. అర్హులైన వారు ఈ నెల 17వ తేదీలోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్లు సూచించారు. 60 శాతం మార్కులతో, గణితం సబ్జెక్టుగా కలిగిన ఇంటర్‌ పూర్తయినవారు, ఐటీఐ (డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌), డిప్లొ మా, బీటెక్‌ సివిల్‌, తత్సమాన అర్హతలు కలిగిన పాత సర్వేయర్లతోపాటు, కొత్త అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా దరఖాస్తు చేసుకున్న వారికి మే 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. రెవెన్యూ పరిపాలనకు తోడుగా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖ ద్వారా ఈ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇందులో నల్లగొండ జిల్లాలోనే 200 మంది, సూర్యాపేట జిల్లాలో 150 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో 150 మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.

మూడు దశల్లో శిక్షణ, పరీక్షలు

సర్వేయర్లకు మూడు దశల్లో శిక్షణ ఇస్తారు. థియరీ, టిప్పన్‌ ప్లాటింగ్‌, క్షేత్ర స్థాయి (ఫీల్డ్‌) విషయాల్లో శిక్షణ ఉంటుంది. ఆ తరువాత 40 రోజుల పాటు మండల సర్వేయర్‌ కింద ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తర్వాత జిల్లా స్థాయిలో వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారికి ఫైనల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అది పాసైతే లైసెన్స్‌ కోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందిన వారు సర్వే చేసేందుకు అర్హులు. వారు చేసే సర్వేకు అధికారిక గుర్తింపు ఉంటుంది. భూ భారతి చట్టం అమలులోనూ సర్వే పనుల కోసం వారి సేవలను పరిగణనలోకి తీసుకోనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చి న భూభారతి చట్టం అమలుకు అర్హులైన సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి ప్రత్యే క శిక్షణ ఇచ్చి, లైసెన్స్‌లు జారీ చేస్తుంది. కాబట్టి జిల్లాలో ఉన్న అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 17లోగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

– నల్లగొండ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

అర్హత కలిగిన ప్రైవేట్‌ సర్వేయర్లకు లైసెన్స్‌లు

ఫ మ్యాథ్స్‌తో ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌ చేసినవారికి అవకాశం

ఫ భూ భారతి చట్టం అమలులో భాగంగా వారికి ప్రత్యేక శిక్షణ

ఫ ఉమ్మడి జిల్లాలో దాదాపు 500 మందికి అవకాశం

ఫ భూ సర్వేకు తొలగనున్న అడ్డంకులు

తీరనున్న సర్వేయర్ల కొరత

జిల్లాలో ఇక సర్వేయర్ల కొరత తీరనుంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 33 మండలాల పరిధిలో 17 మంది ప్రభుత్వ సర్వేయర్లు, ముగ్గురు డిప్యూటీ సర్వేయర్లు, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మంది మాత్రమే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు ఉండగా, 15 మంది మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. యాదాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వివిధ పథకాల కింద భూసేకరణ చేపట్టే పనులకు వారే సర్వే చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం అయ్యేంది. సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే నెలల సమయం పట్టేది. మరోవైపు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా అనేక రకాల భూ సమస్యలు తలెత్తాయి. ఒకరి భూమి మరొకరికి పేరున పడటం, హద్దులు చెరిగిపోయాయి. దీంతో చాలా మంది సర్వేకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే వ్యవసాయ భూములు కూడా రియల్‌ ఎస్టేట్‌గా మారిపోతున్నాయి. ఈ క్రమంలో నాలా కన్వర్షన్‌ కోసం అనేక దరఖాస్తులు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో సర్వేయర్ల కొరత వల్ల సర్వేలో తీవ్ర జాప్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్హత కలిగిన వారికి శిక్షణ ఇచ్చి, లైసెన్స్‌ జారీ చేయడం ద్వారా సర్వేయర్లుగా గుర్తింపు ఇవ్వబోతోంది. దీంతో సర్వే సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి.

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు1
1/1

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement