మాట నిలబెటు్టకునా్నం
కోదాడ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేశామని, గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కోదాడలోని బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్వతంత్ర పోరాటంలో ఓబన్న చూపిన పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కోదాడలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. గత పాలకులు బీసీలను విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా కులగణన చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం కాంగ్రెస్ చేపట్టిన కులగణనను ఆదర్శంగా తీసుకుంటుందని తెలిపారు. అంతకు ముందు భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. అదేవిధంగా కోదాడలోని వైద్యశాల వద్ద 100 పడకల వైద్యశాల భవనం నిర్మించనున్న స్థలాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడే బేంచ్‌పై కూర్చొని కలెక్టర్, ఎస్పీలతో సమాలోచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ ఏసురత్నం, ఏబీసీ చైర్మన్ రాములు, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశం, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేనిబాబు, వంటిపులి వెంకటేష్, వంటిపులి గోపయ్య, శ్రీను, వెంకయ్య పాల్గొన్నారు.
తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
తిరుమలగిరి (తుంగతుర్తి): తన సొంత గ్రామమైన తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో రూ.16 కోట్లతో బ్రిడ్జి, రూ.7.14 కోట్లతో చెక్ డ్యామ్, రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.60లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 600 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తాటిపాముల గ్రామంలో కోటి రూపాయలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, మరో కోటి రూపాయలు ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా చెన్నూరు రిజర్వాయర్ నుంచి తాటిపాముల గ్రామానికి నీరు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు సంకెపల్లి సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్, ఎస్పీ నర్సింహ పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ధాన్యం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ మంత్రిని కోరారు. అంతకుముందు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు.
బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికే 42 శాతం రిజర్వేషన్లు
కాంగ్రెస్ చేపట్టిన కులగణనను దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుంది
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మాట నిలబెటు్టకునా్నం


