వాజ్‌పేయి ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆదర్శం
సూర్యాపేట : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రతి బీజేపీ కార్యకర్తకు మార్గదర్శకమని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి, సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జ్ తూటుపల్లి రవి, చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వాజ్‌పేయి ప్రవేశపెట్టిన సుపరిపాలన విధానాలే నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత బలంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికై న జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, తుక్కాని మన్మథరెడ్డి, బొలిశెట్టి కృష్ణయ్య, రంగినేని రుక్మారావు, నూనె సులోచన, దండం మురళీధర్ రెడ్డి, బాల వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి నూతన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.


