ల్యాబ్ టెక్నీషియన్లు వస్తున్నారు
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు రక్త పరీక్షలు నిర్వహించేందుకు గ్రేడ్– 2 ల్యాబ్ టెక్నీషియన్లు వస్తున్నారు. గతేడాది గ్రేడ్– 2 ల్యాబ్ టెక్నీషన్‌ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్ష ఫలితాలను నవంబర్‌లో విడుదల చేసింది. ఇందులో ఎంపికై న వారికి జోన్ల వారీగా పోస్టులు కేటాయించారు. యాదాద్రి జోన్‌కు 149 పోస్టులను కేటాయించగా ఇటీవల జరిగిన కౌన్సిలింగ్‌లో 52 మంది సూర్యాపేట జిల్లాకు వచ్చారు. దీంతో ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత తీరనుంది.
అందనున్న మెరుగైన సేవలు
జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, పీహెచ్‌సీల్లో 40 మంది వరకు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. చాలా పీహెచ్‌సీల్లో ల్యాబ్ టెక్నీషియన్లు లేక ఏదైనా అనారోగ్యం పాలైతే రక్త పరీక్షకు సూర్యాపేట పట్టణానికే వస్తున్నారు. ఇప్పుడు ప్రతి పీహెచ్‌సీకి ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను పూర్తి స్థాయిలో కేటాయించనున్నారు. జిల్లాకు 52 మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించగా.. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 20 మంది, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి 14, పీహెచ్‌సీలకు 10, డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌కు ఒకటి, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు 8 మంది చొప్పున కేటాయించారు. వీరు మరో రెండు, మూడు రోజుల్లో నియామకపత్రాలు తీసుకుని విధుల్లో చేరనున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే వారితో పాటు రెగ్యులర్‌గా నియామకమైన ల్యాబ్ టెక్నీషియన్లను కూడా ఖాళీగా ఉన్న పీహెచ్‌సీల్లో కేటాయించనుండటంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
ఫ జిల్లాకు 52 మంది కేటాయింపు
ఫ రెండు, మూడు రోజుల్లో నియామక పత్రాలు అందుకోనున్న ఉద్యోగులు


