
పిల్లలు ఫోన్లకు దూరంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆటలపై దృష్టి పెట్టాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో జిల్లా పోలీస్, బాలభవన్ సంయుక్త ఆధ్వర్యంలో సూర్యా పేట పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పిల్ల లకు ఆటల ఉచిత శిక్షణ శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. మేధస్సును పెంచే ఆటలపై దృష్టి పెట్టాలన్నారు. పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, జిల్లా బాల భవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణా రెడ్డి, అమిద్ ఖాన్, యోగా గురువు, జిల్లా బాల భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ