
కాంటాలు త్వరగా పూర్తిచేయాలి
పెన్‌పహాడ్, మోతె: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు త్వరగా పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. శనివారం పెన్‌పహాడ్ మండలం అనంతారం, అనాజిపురంతోపాటు మోతె మండలం రావిపహాడ్, బీక్యాతండాలో కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ఎప్పటికప్పుడు తేమశాతం చూసిన ధాన్యాన్ని కాంటాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. కేంద్రాలకు అవసరమైన లారీలను పంపిస్తామని వెంటనే బస్తాలు ఎగుమతి చేయాలన్నారు. ట్రక్కు షీట్ రాగానే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు. ఆయన వెంట పెన్‌పహాడ్ తహసీల్దార్ లాలు, మోతె డీటీ లావణ్య, ఏఓ అరుణారెడ్డి, ఏపీఎంలు అజయ్‌నాయక్, వెంకయ్య, ఏఈఓ ఝాన్సీ, సీఈఓ సైదులు, ధనలక్ష్మి, సుధాకర్ ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు