
పేదల ‘ఉపాధి’కి ఎసరు!
వందరోజులు పని కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులను తగ్గించడం సరైంది కాదు. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలి. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత మూడు నెలల పాటు ఉపాధి పనికి వెళ్లి జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు పనిదినాలు తగ్గిస్తే ఎలా బతకాలి.
– గుండాల కొమరయ్య, ఉపాధి కూలీ, తుంగతుర్తి
పనులు కొనసాగుతున్నాయి
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025–26గాను సూర్యాపేట జిల్లాకు 32.92 లక్షల పనిదినాలు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన పనులను చేపడుతున్నాం. నిర్దేశిత సమయంలోనే పనుల లక్ష్యాన్ని చేరుకుంటాం.
– వీవీ. అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట
నాగారం : కేంద్ర ప్రభుత్వం పేదల ఉపాధికి ఎసరు పెట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి కేంద్రం పరిమితులు విధించింది. ఈ పథకంలో పనిదినాలు తగ్గించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద ప్రతి వేసవిలో మూడు నెలలపాటు కూలి పనులు దొరకడంతో కూలీల జీవనం సజావుగా సాగేది. కూలీలకు రోజువారీ కూలి గరిష్టంగా రూ.260 వరకు వచ్చేంది. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉపాధి పనులకు పోతె రోజుకు రూ.750 వదరకు కూలి వచ్చేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులు తగ్గించడం తమ జీవనోపాధిని దెబ్బతీయడమేనని కూలీలు వాపోతున్నారు.
ప్రభుత్వ పనులపైనా ప్రభావం..
ఉపాధిహామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, గ్రామ పంచాయతీ భవనాలు, పశువుల పాకలు, పౌల్ట్రీలు, చేపల కుంటలు, పండ్ల తోటలు పెంపకాలు, చెక్ డ్యామ్ నిర్మాణాలు వంటి పనులకు వినియోగిస్తుంది. ఉపాధిహామీ పనిదినాలను తగ్గించడంతో ప్రభుత్వ అభివృద్ధి పనులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పీఆర్ శాఖ అధికారులు అంటున్నారు.
తగ్గించిన పనిదినాలు 24.05 లక్షలు
జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా 3.36 లక్షల మంది కూలీలు ప్రతి ఏడాది పనులకు వెళ్తున్నారు. మొత్తం 2.63 లక్షల జాబ్ కార్డులుండగా 5.70లక్షల మంది రిజిస్టర్డ్ కూలీలున్నారు. 2024–25 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 57.42 లక్షల పనిదినాలు కేటాయించగా ప్రస్తుతం 2025–26 సంవత్సరానికి కేవలం 32.92 లక్షల పనిదినాలు కేటాయించింది. దాదాపు 24.05 లక్షల పనిదినాలు తగ్గించడంపై కూలీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఫ ఉపాధిహామీ పనిదినాలు తగ్గింపు
ఫ పరిమితులు విధించిన కేంద్రం
ఫ ఆందోళనలో కూలీలు
జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య 3.36 లక్షలు
2024–25లో పనిదినాల కేటాయింపు 57.42 లక్షలు
2025–26 ఆర్థిక సంవత్సరానికి 32.92 లక్షలలు

పేదల ‘ఉపాధి’కి ఎసరు!

పేదల ‘ఉపాధి’కి ఎసరు!