
పేదల సమస్యల పరిష్కారమే సీపీఐ ఎజెండా
చిలుకూరు: పేద ప్రజల సమస్యల పరిష్కారమే సీపీఐ ఎజెండా అని మాజీ ఎమ్మెల్యే , సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో నిర్వహించిన సీపీఐ మండల మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే పాలకులు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఉపాధిహామీ పథకానికి, వ్యవసాయ, కార్మిక రంగాలకు కేంద్రం బడ్జెట్ లో నిధులు తగ్గించడం వల్ల దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో పాలకులు ఆలోచన చేయాలన్నారు. పార్టీనాయకులు ప్రజల పక్షాన బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభకు ముందు పార్టీ జెండాను పల్లా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల మహాసభలో 250 మంది ప్రతినిధులు పాల్గొనగా, 35 మంది కౌన్సిల్ సభ్యులను, మండల కార్యవర్గ సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సభలో సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డా నారాయణరావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి, యల్లావుల రాములు, ఉస్తెల నారాయణరెడ్డి, బూర వెంకటేశ్వర్లు, కొండా కోటయ్య, చేపూరి కొండలు, దొడ్డా వెంకటయ్య, సాహెబ్ అలీ, కాంపాంటి వెంకటయ్య, రెమిడాల రాజు, చిలువేరు అంజనేయులు, పొరడ్ల మట్టయ్య, జయసుధ, తాళ్లూరి వెంకటయ్య, కీసర వెంకటేశ్వర్లు, కందుకూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.