
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల: పారిశుద్ధ్య, మున్సిపల్ కార్మికులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శనివారం సూర్యాపేనట జిల్లా కేంద్రంలోని మున్పిపల్ కార్యాలయంలో కార్మిక చట్టాలపై మున్పిపల్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. సూర్యాపేట జిల్లాను క్లిన్ సిటీ జాబితాలో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులు, విధులు గూర్చి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్పిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, మమత, న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి ఫర్హీన్ కౌసర్