
త్యాగానికి తగిన ఫలితం దక్కింది
ఆత్మకూర్(ఎస్): ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేస్తే ఏదో ఒక రోజు పార్టీ తనను గుర్తిస్తుందని భావించానని, అనుకున్నట్లుగానే తనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఆదివారం తన స్వగ్రామమైన ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో అద్దంకి దయాకర్ పాల్గొని మాట్లాడారు. తనను ఉన్నత పదవిలో చూడాలని 11ఏళ్లుగా ఎందరో ఆశతో ఎదురు చూశారని, వారి దీవెనలతోనే కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి జేఏసీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చాక పార్టీ తన స్థాయికి మించి బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. తన అభివృద్ధికి, ఉన్నతికి సహకారం అందించిన శ్రేయోభిలాషులను అన్నివిధాలుగా ఆదుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం పాదాలకు పాలాభిషేకం చేశారు. క్రీస్తు రాజు దేవాలయంలో ఫాదర్ అలెగ్జాండర్‌చే దీవెనలు తీసుకున్నారు. మనం ఫౌండేషన్ గంపల కృపాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవా జేఏసీ చైర్మన్ భూపతి రాములు, గంపల నారాయణ, జానకిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకన్న, యాదగిరి, గరిగంటి ప్రకాశ్, గంపల లింగయ్య, సైదులు, నిమ్మ ఎల్ల య్య, వార్డెన్ లింగయ్య, కొంపల్లి మల్లారెడ్డి, గుంటూరు చిట్టిబాబు, రామకృష్ణ, గంగరబోయిన శ్రీను, గురుస్వామి, జలగం మల్లేశ్, కాటూరి రాములు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్