
మెడికల్ మాఫియాను నిర్మూలించాలి
సూర్యాపేట : జిల్లాలో మెడికల్ మాఫియాని వెంటనే నిర్మూలించి, డీఎంహెచ్‌ఓను విధుల నుంచి తొలగించాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా శనివారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మెడికల్ మాఫియా వల్ల అసలు డాక్టర్లు ఎవరో నకిలీ డాక్టర్లు ఎవరో తెలియక ప్రజలు గందరగోళంలో పడుతున్నారన్నారు. డీఎంహెచ్‌ఓ కోటాచలం అవి నీతికి పాల్పడుతూ, అనర్హులు ఆసుపత్రులు పెట్టుకోవడానికి విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.