
పెరుగుతున్న మూసీ ప్రాజెక్టు నీటి మట్టం
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం 636.50 అడుగులకు చేరుకుంది. హైదరాబాద్‌తో పాటు మూసీ పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు మూసీలోకి గురువారం 540 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాంత్రానికి 636.50 అడుగులకు చేరుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 622 అడుగుల కనిష్ఠ స్థాయికి పడిపోగా, గత 50 రోజుల్లో దాదాపు 15 అడుగుల మేర నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.43 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేసవి కాలంలోనే ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
636.50 అడుగులకు చేరిన నీరు