ఇక్కత్‌కు, శిల్పకళకు ఫిదా..
సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు
భూదాన్‌పోచంపల్లిలోని
టూరిజం పార్క్‌లో సుందరీమణులు
భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సుందరీమణులు గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఒక బృందం భూదాన్‌పోచంపల్లిని, మరో బృందం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించింది.
నేతన్నల గొప్పదనం చూసి అబ్బురపడి..
ఆఫిక్రా దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులు భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాటు చేసిన చేనేత థీమ్‌లో పాల్గొని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక్కత్ వస్త్రాలను పరిశీలించి అబ్బురపడ్డారు. చేనేతల గొప్పతనం చూసి అందాలభామలు చప్పట్లు కొట్టారు. అలాగే ఇండో వెస్ట్రన్ ఇక్కత్ దుస్తులతో మోడల్స్ నిర్వహించిన ర్యాంప్ వాక్ చూపి మైమరిచిపోయారు. ప్రముఖ డిజైనర్ స్వాతి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో రూపొందించిన ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వస్త్రాలను ప్రముఖ మోడల్స్ ధరించి, ప్రముఖ కొరియోగ్రఫీ సుందర్ పర్యవేక్షణలో ప్రదర్శించిన రాంప్‌వాక్ వావ్ అన్పించింది. సుమారు 30 మంది మోడల్స్ ర్యాంప్‌వాక్ చేశారు.
ఆకట్టుకున్న చేనేత స్టాళ్లు
టూరిజం పార్కు ఆవరణలో పద్మశ్రీ గజం గోవర్థన్, జాతీయ అవార్డు గ్రహీత తడక రమేశ్, సాయిని భరత్, రాష్ట్ర అవార్డు గ్రహీతలు భోగ బాలయ్య, ఎన్నం మాధవిశివకుమార్, చేనేత టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, చేనేత సహకార సంఘంతో పాటు గద్వాల్, నారాయణపేట, సిద్ధిపేట గొల్లభామ చేనేత స్టాల్స్ ఏర్పాటు చేశారు.వీటిలో పోచంపల్లి ఇక్కత్‌తో పాటు తేలియారుమాళ్లు, గొల్లభామలు చీరలను చూసి ప్రపంచ సుందరీమణులు మురిసిపోయారు.
సంప్రదాయ చీరకట్టుతో నృసింహుడి క్షేత్రానికి..
కరేబియన్ దీవులకు చెందిన తొమ్మిది మంది సుందరీమణులు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్ప కళను చూసి పరవశం పొందారు. సంప్రదాయ చీరకట్టు, లంగా ఓణీతో సాయంత్రం 5గంటలకు కొండపైన గల అతిథిగృహానికి చేరుకున్న సుందరీమణులు.. తొలుత అఖం దీపారాధన చేశారు. ఆ తరువాత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫొటోకు పూజలు చేసి మీడియా గ్యాలరీ వద్ద అతిథులకు అభివాదం చేశారు. అలాగే బ్రహ్మోత్సవ మండపం వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లో శ్రీస్వామివారి కై ంకర్యాలను వీక్షించి ఫొటోలు దిగారు.
ఇక్కత్ వస్త్రాలతో సన్మానం
సుందరీమణులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇక్కత్ శాలువాతో సన్మానించారు.
ఫ జిల్లాలో రెండు బృందాలుగా పర్యటన
ఫ ఒక టీం భూదాన్‌పోచంపల్లి, మరొకటి యాదగిరిగుట్ట ఆలయ సందర్శన
ఫ ఇక్కత్ డిజైన్లు చూసి అబ్బురపడిన అందగత్తెలు
ఫ యాదగిరిగుట్టలో నృసింహుడి దర్శనం, శిల్పకళను వీక్షించి పరవశం


