భవిష్యత్‌కు బాలమేధస్సు ఎంతో అవసరం
హుజూర్‌నగర్ : భవిష్యత్‌కు బాలమేధస్సు ఎంతోఅవసరం అని జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్ అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని వీవీఎం ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యా బాల వైజ్ఞానిక ప్రదర్శనను అట్టహాసంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ డి. రాధిక అరుణ్ కుమార్ .. జ్యోతి ప్రజ్వలన చేయగా డీఈఓ అశోక్, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ కోతి సంపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌లతో కలిసి సైన్స్‌ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్‌ఫెయిర్ ఎంతో దోహద పడతుందన్నారు. సైన్స్ ఫెయిర్‌లో నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలో అనువర్తించుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక త వైజ్ఞానిక ప్రదర్శన వల్ల బయటపడుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అవగతం చేసుకొని మానవాళి వికాసానికి తోడ్పడాలని సూచించారు.
తిలకించిన 2వేల మంది విద్యార్థులు
సెన్స్ ఫెయిర్‌లో దాదాపు 246 వైజ్ఞానిక ప్రదర్శనలు, 47 ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు కలిపి 293 ఎగ్జిబిట్లు ప్రదర్శించారు. ఇందులో 500 మంది విద్యార్థులు, 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా సుమారు 2 వేల మంది విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎల్. దేవరాజ్, ఎంఈఓలు సైదా నాయక్, సలీం షరీఫ్, ఛత్రూ నాయక్, వెంకటాచారి, సత్యనారాయణ రెడ్డి, కాటయ్య, వెంకటరెడ్డి, శ్రీనివాస్, గురవయ్య, వివిధ మండలాల కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, గెజిటెడ్ హెచ్‌ఎంలు, జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ డీఈఓ అశోక్
ఫ హుజూర్‌నగర్‌లో అట్టహాసంగా
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభం
ఫ 293 ఎగ్జిబిట్ల ప్రదర్శన
భవిష్యత్‌కు బాలమేధస్సు ఎంతో అవసరం


