పని ప్రదేశాల్లో మహిళల రక్షణే ధ్యేయం
భానుపురి (సూర్యాపేట) : పని ప్రదేశాల్లో మహిళల రక్షణే ధ్యేయమని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు పేర్కొన్నారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టంపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ శిరీష, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి నరసింహారావు, కమిటీ సభ్యులు దయానందరాణి, శంకర్ నాయక్, జిల్లా ట్రెజరీ అధికారి రవికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, టీఎన్జీవోస్ జనరల్ సెక్రటరీ దున్న శ్యామ్ పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు


