3.27 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
భానుపురి (సూర్యాపేట ) : ఈ సంవత్సరం ఖరీఫ్ ధాన్యం సేకరణలో భాగంగా సూర్యాపేట జిల్లాలో 62,887 మంది రైతుల నుంచి 3,27,579.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు 2025– 26 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ,మెప్మా, ఎఫ్ పీఓల ఆధ్వర్యంలో 348 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 62,887 మంది రైతుల ద్వారా 2,27,320.560 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 1,00258.720 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం మొత్తం కలిపి 3,27,579.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇందుకుగాను రైతులకు రూ.782.59 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే బోనస్ కింద మరో రూ.113.65 కోట్లు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో సరిపడా ఎరువులు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, ఎవరూ అధైర్య పడవద్దని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పిల్లలమర్రి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. రైతులు అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయవద్దని సూచించారు. యాసంగి 2025 సీజన్‌కు ప్రస్తుతం జిల్లాలో 10,508 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇప్పటికే 32,910 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఓ కృష్ణ సందీప్, పీఏసీఎస్ సిబ్బంది వెంకన్న, రైతులు శివరాత్రి బుచ్చి రాములు, బీరెల్లి రామచంద్ర రెడ్డి, వెంకట్ రెడ్డి, లింగస్వామి పాల్గొన్నారు.
3, 4న సూర్యాపేట జిల్లాలో జనం బాట
హుజూర్‌నగర్ : జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనవరి 3,4 తేదీల్లో సూర్యాపేట జిల్లాకు రానున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్ వెల్లడించారు. మంగళవారం హుజూర్‌నగర్‌లో జాగృతి జనం బాట పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. 3వ తేదీన తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు, 4న హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో జనం బాట కార్యక్రమం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు కేఎల్‌ఎన్ రావు, ఎస్‌కే మస్తాన్, కె. గోవర్ధన్, కేఎస్‌ఎన్ రెడ్డి, నర్సింహా రావు, ఉదారి వేణు, సతీష్ పాల్గొన్నారు.
3.27 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు


