మొబైల్ కేంద్రంగానే సైబర్ మోసాలు
సూర్యాపేటటౌన్ : మొబైల్ కేంద్రంగానే సైబర్ మోసాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 104 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం 1334 మొబైల్ లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. మన విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫొటోలు మొదలైనవి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నామని, మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందన్నారు. మొబైల్ పోయినా, దొంగలించినా సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ బాధితులకు 104 మొబైల్స్ అందజేశాం
ఫ సెల్‌ఫోన్ రికవరీ మేళాలో ఎస్పీ నరసింహ


