
21 కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సూర్యాపేటటౌన్ : ఈ నెల 22వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి(డీఐఈఓ( భానునాయక్ తెలిపారు. శనివారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎస్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫెయిల్ అయిన వారు, ఇంప్రూవ్‌మెంట్ రాసేవారు 8,600 మంది ఉన్నారని తెలిపారు. వారికోసం 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 8 పరీక్ష కేంద్రాలు, కోదాడలో ఐదు పరీక్షా కేంద్రాలు, హుజూర్‌నగర్‌లో రెండు, తుంగతుర్తిలో రెండు, మఠంపల్లి, నేరేడుచర్ల, తిరుమలగిరి, నడిగూడెంలో ఒక్కొక్క పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీ సభ్యులు, ప్రిన్సిపాల్స్ రాజమోహన్, విజయనాయక్, సీనియర్ అధ్యాపకులు జి.లక్ష్మయ్య, జీజేఎల్‌ఏ జిల్లా అధ్యక్షుడు వీడీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డీఐఈఓ భానునాయక్