
21 నుంచి తాడువాయి పీఏసీఎస్‌లో విచారణ
మునగాల: మునగాల మండలం తాడువాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై ఈనెల 21 నుంచి 23 వరకు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు బహిరంగ విచారణ చేయనున్నట్లు సొసైటీ ఇన్‌చార్జి సీఈఓ చందా ప్రవీణ్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా సహకార అధికారి పద్మ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వి. ఇందిరను నియమించారని తెలిపారు. రుణం తీసుకొని తిరిగి చెల్లించినప్పటికీ సొసైటీలో జమకాని రైతులు సరైన ఆధారాలతో కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. ఈనెల 21న విజయరాఘవపురం, నరిసింహులగూడెం, కలకోవ గ్రామాల రైతులు , 22న తాడ్వాయి, వెంకట్రాంపురం, మాధవరం, జగన్నాథపురం, 23న నేలమర్రి, రేపాల గ్రామాల రైతులు విచారణకు హాజరుకావొచ్చని కోరారు.
పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట): పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. సూర్యాపేట పట్టణంలోని విజయ కాలనీలోగల బాల సదనంను ఆమె తనిఖీ చేశారు. పిల్లలతో ముచ్చటించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా.. ఆహారం సరిగ్గా ఇస్తున్నారా.. లేదా అని ఆరా తీశారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొంపల్లి లింగయ్య, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుంకరబోయిన రాజు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి.వెంకట రత్నం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పి.వాణి, డి.ఎల్.ఎస్.ఎ నామినేటెడ్ మెంబర్స్ అల్లంనేని వెంకటేశ్వర్ రావు, గుంటూరు మధు, అడ్వకేట్స్ పాల్గొన్నారు.
హామీల అమలులో విఫలం
సూర్యాపేట అర్బన్: గొల్లకురుమలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని తెలంగాణ గొర్రెలమేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో చేతివృత్తిదారుల భవనంలో జిల్లా అధ్యక్షుడు కడం లింగయ్య ఆధ్యర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్లకురుమలకు గొర్రెల కొనుగోలుకు రూ.2 లక్షల నగదు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి, వజ్జ వినయ్, కంచుకోట్ల శ్రీనివాస్, రాజుల నాగరాజు, గుండాల లింగయ్య, వీరబోయిన సైదులు, చిట్లింగి యాదగిరి, కుక్కల సాంబయ్య, ఎం.సైదులు పాల్గొన్నారు.
పెండింగ్ కరువు భత్యం విడుదల చేయాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి మైలారపు వెంకన్న జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సంఘం జిల్లా కార్యాలయానికి రూ.80 వేలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్ అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మైలారపు వెంకన్న ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, జె.యాకయ్య, శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, వెంకటయ్య, బి.ఆడం, వి.రమేష్, రమేష్, డి.లాలు, కె .జ్యోతి, ఆర్.శ్రీను, అభినవ్ పాల్గొన్నారు.

21 నుంచి తాడువాయి పీఏసీఎస్‌లో విచారణ

21 నుంచి తాడువాయి పీఏసీఎస్‌లో విచారణ