
ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు.సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మే 22 నుంచి 29 వరకు రోజూ ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండవ సంవత్సరం పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీఐఈఓ భానునాయక్, డీఈఓ ఆశోక్, డీఎంహెచ్‌ఓ కోటాచలం, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయి గౌడ్, శ్రీలత రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్