28 మందికి ఉద్యోగ నియామకపత్రాలు
కోదాడ: రెవెన్యూ, వైద్యారోగ్యశాఖల్లో కారుణ్య నియామకంతోపాటు, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు పొందిన 28 మందికి ఆదివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియామకపత్రాలు అందజేశారు. రెవెన్యూ శాఖలో ఐదుగురు, వైద్యారోగ్యశాఖలో ఒకరికి కారుణ్య నియమాకం పొందగా.. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 మంది ఉద్యోగాలు పొందారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీఎంహెచ్‌ఓ కోటాచలం తదితరులు పాల్గొన్నారు.
మైనర్లకు వాహనాలు
ఇవ్వొద్దు
సూర్యాపేటటౌన్ : పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారికి 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కుదరదని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను పోలీసు శాఖ పటిష్టంగా అమలు చేస్తుందని, కొత్త నిబంధనల ప్రకారం మైనర్ డ్రైవింగ్‌కు గరిష్టంగా రూ.25 వేల వరకు జరిమానా ఉంటుందని, తల్లిదండ్రులను కూడా కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ మైనర్స్ ఒకసారి పట్టుబడితే వారి వివరాలను రవాణా శాఖకు పంపుతామని తెలిపారు.
వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాలకృష్ణ
నాగారం : వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలకృష్ణ ఎంపికయ్యారు. ఆదివారం తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జైపాల్ ఆయనకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆలకుంట్ల ఉపేంద్ర, జనరల్ సెక్రటరీ రూపానిరాజు, సోషల్ మీడియా ఇన్‌చార్జి శివరాత్రి గోపి, కార్యదర్శి బండారి రాజు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల రమేష్‌చంద్ర, ఆలకుంట్ల వెంకన్న, ఆలకుంట్ల మల్లయ్య, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తిరుకల్యాణోత్సవాలకు
ఏర్పాట్లు పూర్తి
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈనెల 10 నుంచి 15వరకు జరగనున్న తిరుకల్యాణోత్సవాల వాల్‌పోస్టర్లను ఆదివారం ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణా చార్యులు, వంశీకృష్ణమాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు.
28 మందికి ఉద్యోగ నియామకపత్రాలు


