గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి
కోదాడ: కొత్త సర్పంచ్‌లు శక్తివంచన లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తేనే చిరస్థాయియిగా పేరు నిలిచిపోతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోదాడ నియోజవకర్గ పరిధిలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల సన్మానం కార్యక్రమం ఆదివారం కోదాడలోని డేగబాబు పంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతితిగా హాజరైన మాట్లాడుతూ కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి తాను, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శక్తిమేర కృషి చేస్తున్నామన్నారు. ఇదేస్ఫూర్తితో కొత్త సర్పంచ్‌లు కూడా పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని.. ఎన్నికల అనంతరం అందరిని కలుపుకొని పోతూ అభివృద్ధే ఎజెండాగా పనిచేయాలని సూచించారు. కోదాడ ఎమ్మల్యే పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించడం అభినందనీయమని, వచ్చే పరిషత్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను మంత్రి, ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేని బాబు, కందుల కోటేశ్వరరావు, బుర్రా సుధారాణి, చింతలపాటి శ్రీనివాస్, వరప్రసాదరెడ్డి, డేగ కొండయ్య, ముస్కు శ్రీనివాసరెడ్డి, జైపాల్‌రెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, మాతంగి బసవయ్య, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


