టెట్ వాయిదా వేయాలి
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వం జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను తాత్కాలికంగా వాయిదా వేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, వేణు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని, కొందరు ఉపాధ్యాయులు మూడు దశల ఎన్నికల విధులను కూడా నిర్వర్తించారని తెలిపారు. ఈ ఎన్నికల విధుల కారణంగా టెట్‌కు సన్నద్ధమయ్యే సమయం దక్కలేదని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టెట్‌ను కొన్ని రోజుల పాటు వాయిదా వేసి ఉపాధ్యాయులు ప్రిపేర్ అయ్యేందుకు కొంత గడువు ఇవ్వాలని విన్నవించారు.
విద్యారంగాన్ని
రక్షించుకుందాం
తుంగతుర్తి : ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తిలోని షేక్ సయ్యద్ ప్రాంగణం (బండారు ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో)లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నన్నెబోయిన సోమయ్య అధ్యక్షతన జరిగిన ఆ సంఘం జిల్లా కమిటీ విస్త్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు భీమిరెడ్డి సోమిరెడ్డి, జోగునూరి దేవరాజు, ఓరుగంటి అంతయ్య, సీహెచ్.రాములు, సిరికొండ అనిల్‌కుమార్, పి.వెంకటేశం, ఎడ్ల సైదులు, పి.శ్రీనివాస్‌రెడ్డి, కె.అరుణ భారతి, జి.వెంకటయ్య, జె.కమల, ఇతర సంఘాల నాయకులు వై.వెంకటేశ్వర్లు, కేఏ.మంగ, ఆర్.ధనమూర్తి, బుర్ర శ్రీనివాస్, టి.యాదగిరి, ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, ఎస్.సోమయ్య, వి.రమేష్, బి.ఆడమ్, సీహెచ్.రమేష్ పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో
ప్రత్యేక పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు.
నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రబాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు.
టెట్ వాయిదా వేయాలి


