56 ఏళ్ల అ‘పూర్వ’ సమ్మేళనం
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1969లో ఎస్‌ఎస్‌సీ మొదటి బ్యాచ్ చదివిన విద్యార్థులు 56 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయుడైన అర్వపల్లి రంగారావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముడుంబ జగన్నాథచార్యులు, వర్ర వెంకట్‌రెడ్డి, మూసం సత్యనారాయణ, కోట హరిప్రసాద్, కె. నాగేశ్వరరావు, వీర్లపల్లి రామారావు, ఓరుగంటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


