4,146 కేసులు పరిష్కారం
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద
చివ్వెంల (సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి కోర్టుల్లో ఏర్పాటు చేసిన లోక్‌అదాలత్‌లలో మొత్తం 4,146 కేసులు పరిష్కంచామన్నారు. ఇందులో ఒక్క సూర్యాపేటలోనే కోర్టులో 2,226 కేసులు ఉన్నాయన్నారు. ఒక్కసారి లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసుల్లో అప్పీల్‌కు అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా కొద్దికాలంగా వేరుగా ఉంటున్న భార్యభర్తలు కోర్టు ద్వారా కలిశారు. వీరిచే కోర్టు ప్రాంగణంలో మొక్కను నాటించారు. సీనియర్ న్యాయవాది ఈశ్వర్ కుమార్ సహకారంతో లయన్స్ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో 500 మంది కక్షిదారులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రీట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.


